డేటింగ్ యాప్ లు ఎంత ప్రమాదకరమో లియో న్యూస్ ఓ ప్రత్యేక కథనం ద్వారా వివరించింది. ఈ యాప్ ద్వారా నగ్న వీడియో దాకా వెళ్లిన వ్యవహారం చివరికి రూ. 16 లక్షలు దోచుకునే దాకా వెళ్లింది. బెంగళూరుకు చెందిన ఓ టెకీ ఈ తరహాలో మోసపోయాడు. వివరాల్లోకి వెళితే ఆ టెకీకి ఈ యాప్ ద్వారా శ్వేత అనే యువతి పరిచయమైంది. డిజిటల్ పేమెంట్ ద్వారా రెండు వేల రూపాయలు పంపాలని కోరింది. అతను పంపించాడు. also read: వయసు పిలిచింది.. మనసు వలచింది.. డే‘టింగురంగా’
అలా ఛాటింగ్ కొనసాగాక తను నగ్నంగా కనిపిస్తాను అంటూ ఊరించింది. అతను పొంగిపోయాడు. అలా ఆమె నగ్న వీడియోను చూపించింది. ఆ తర్వాత అతన్ని కూడా అలానే చేయాలని కోరింది. అతను కూడా రెచ్చిపోయి తన నగ్న వీడియోను చూపించాడు. దాన్ని ఆమె తన స్క్రీన్ రికార్డింగు ద్వారా రికార్డు చేసింది. దాంతో అతని జుట్టు ఆమె చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఆమె బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది.
గత్యంతరం లేక అతను దశల వారీగా దాదాపు రూ. 16 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆమె అతనికి నగ్నంగా చూపించింది నిజానికి ఆమె వీడియో కాదు.. అలాంటి ఓ వీడియోను డౌన్ లోడ్ చేసుకుని చూపించింది. అది అతను నమ్మేశాడు. ఇలా ఎలా మోసం చేస్తారో లియో న్యూస్ సమగ్రంగా వ్యాసం రాసింది. ఆమె బెదిరింపులు అక్కడితే ఆగకపోవడంతో చేసేది లేక అతను పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.