టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుపాటి ఈమధ్యనే ఒక ఇంటివాడు అయ్యారు. ప్రేయసి మిహీక బజాజ్ ను పెద్దల అంగీకారంతో ఆగష్టు 10వ తేదీన వివాహం చేసుకున్నాడు రానా. ఈ వేడుకకు అతి తక్కువ మంది అతిధులు హాజరైయ్యారు. ఇక మిహీక తన పుట్టిన రోజును డిసెంబర్ 19వ తేదీన జరుపుకున్నారు. ఆమె పుట్టిన రోజున ఒక మంచి పార్టీతో సర్ ప్రైజ్ చేశాడు రానా. సినిమా షూటింగులతో బిజీగా ఉన్న రానా తన ప్రేయసి పుట్టిన రోజున పిజ్జా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో కేవలం రానా, మిహీక మాత్రమే పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన ఒక ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా లో పోస్ట్ చేశాడు రానా. ‘ఈరోజు నా భార్య పుట్టిన రోజు. అందుకనే నాకు హాలిడే’ అంటూ పోస్ట్ చేశాడు. రానా పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె కొవ్వొత్తుల వెలుగులో నల్ల రంగు స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి మెరిసిపోతూ కనపడింది. తన భర్త సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా తన పుట్టిన రోజును ఇంత అందంగా సెలబ్రేట్ చేసినందుకు మిహీక ఆనందంలో మునిగి తేలుతోంది. అంతే కాకుండా రానాకు ప్రత్యేకమైన థాంక్స్ చెప్పుకుంది.
ఇక రానా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన అభిమానుల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. మీరిద్దరూ ఇదే విధంగా సంతోషంగా జీవితాన్ని గడపాలని వారు కోరుకుంటున్నారు. రానా కూడా ఈనెల 14వ తేదీతో 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రానా విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.
Also Read: సామ్ జామ్; లో ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా.. !











