కరోనా విషయంలో జనమంతా మన సినీ సెలబ్రిటీలు ఏంచేస్తున్నారు అనే విషయాన్నే గమనిస్తున్నారు. కొందరు మాటలకే పరిమితం కాగా మరికొందరు చేతల్లో తామేంటో చూపిస్తున్నారు. చేతల్లో చూపించే జాబితాలో హీరోయిన్ రాశిఖన్నా చేరిపోయిందని అనవచ్చు. లాక్‌డౌన్ సమయంలో అనేక మంది అనాథలు, భిక్షగాళ్ళ ఆకలిదప్పులు తీర్చే పనుల్లో ఆమె బిజీగా ఉంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటించే జనాలు అనేకం. వారికి కడపునిండా తిండి పెట్టడం మీద రాశిఖన్నా దృష్టి సారించారు.
దీని కోసం ఆమె ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపారు. వీరితో మరి కొందరు సినీ జనం కూడా కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ అన్నదానం కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను కూడా ఏర్పాటుచేశారు. కొందరు ఇలా చేసే పనికి కొండంత ప్రచారం చేసుకుంటార. ఇవేమీ లేకుండా రాశిఖన్నా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇదే పద్దతితో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుకు సాగితే ఎంత బాగుంటుంది.
Must Read ;- జనజీవితాల్లో వెలుగులు నింపే భానుడు సోనూ