బిపోర్ లాస్టియర్ వచ్చిన ‘వెంకీమామ’ సినిమా మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మేనమామ, మేనల్లుడు.. వెంకీ, నాగచైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానుల్ని అలరించారు. ఇందులో చైతూ సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. వీరిద్దరి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ జోడీ మరోసారి రొమాన్స్ కు రెడీ అయ్యారని టాక్.
నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్వకత్వంలో ‘థాంక్యూ’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఆల్రెడీ అవికా గోర్, మాళవికా నాయర్ ఎంపికయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా రాశీఖన్నాను దర్శకుడు ఎంపిక చేశాడు. నిజానికి మనం సినిమాలో రాశీఖన్నా చిన్న పాత్రలో కనిపించింది. ఆ టైమ్ లో రాశీకి తన తర్వాత సినిమాలో ఫుల్ హీరోయిన్ గా ఛాన్సిస్తానని విక్రమ్ కుమార్ ప్రామిస్ చేశాడట. ఇన్నాళ్ళకు ఈ సినిమాతో తన ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాడని తెలుస్తోంది. మరి రాశీఖన్నా ఈ సినిమాకి ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.