దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలబ్రిటీలు, హీరోలు తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ రూ. 2 కోట్లు విరాళమిచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ. 2 కోట్లు విరాళమిచ్చారు. బిగ్ బీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఈ కేంద్రానికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీస్తున్నారట. ఆక్సిజన్, ఇతర సదుపాయాల్ని కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ వెల్లడించారు.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










