వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్ మోహన్ భగవత్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ భగవత్..మాతృ భాషలోనే విద్యాభ్యాసం కొనసాగాలని సూచించారు. అలాంటప్పుడే విద్యార్థులు ప్రభావవంతంగా నేర్చుకోగలరని, ఫిన్‌లాండ్ విద్యావిధానాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శాస్త్రీయ విజ్ఞానం అన్ని భారతీయ భాషల్లో సామాన్యులకు చేరాలన్నారు మోహన్ భగవత్. సమాజానికి విజ్ఞానం పంచే విధంగా భారత్ దూసుకుపోతోందని..ఇది మనకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. భారత్ సూపర్ పవర్‌గానే కాదు..విశ్వగురూగానూ ఎదగాలన్నారు. ప్రపంచానికి ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాలు కలిగిన సమగ్ర దృక్పథాన్ని అందించాలన్నారు.
సైన్స్, మతం మధ్య ఎలాంటి సంఘర్షణ లేదన్నారు. రెండింటి దారులు వేరైనా లక్ష్యం మాత్రం సత్యం తెలుసుకోవడమేనన్నారు మోహన్ భగవత్. అర్థశాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో నిర్వచనాలు చెప్పినా చాణక్యుడి అర్థశాస్త్రం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందన్నారు. కొందరిలో ఎదిగినకొద్దీ అహంకారం పెరుగుతోందని. మనిషి అహాన్ని వదిలి ఇతరుల కోసం ఎప్పుడు బతుకుతారో అప్పుడే నిజమైన సంతోషం పొందుతాడని బోధించారు.
వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ పార్టీ నేతలు దాని గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా,సరైన సదుపాయాలు లేకుండా ఇంగ్లీష్ విధానం ప్రవేశపెట్టడంతో మెజార్టీ విద్యార్థులు విషయం అర్థంకాక తలలు పట్టుకునేవారు. చాలా మంది చదువు అర్థం కాక బడికి దూరమయ్యారు. ఐతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ మాతృభాషలో విద్యకు ప్రాధాన్యమిస్తూనే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు పెంచే చర్యలు తీసుకుంటోంది.
ఇక, RSS చీఫ్ మోహన్ భగవత్ సైతం మాతృభాషలోనే విద్య గురించి నొక్కి చెప్పారు. పరోక్షంగా జగన్‌కు, ఆ పార్టీ నేతలకు చురకలు అంటించాకు. ఏ విషయమైనా మాతృభాషలో చెబితేనే ఎక్కువగా అర్థమవుతుందనేది కాదనలేని సత్యం











