పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’.. మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మూడేళ్ళ విరామం తర్వాత పవన్ మళ్ళీ తెరమీద కనిపించనుండడంతో ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ వసూళ్ళను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడట దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ అయినప్పటికీ… పవన్ కళ్యాణ్ కోసం కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్ని రాసుకున్నాడట దర్శకుడు. ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ ఇంట్రడక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఇండస్ట్రీ నుంచి టాక్స్ వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ ఇంట్రడక్షన్ సీనే ఫైటింగ్ తో మొదలవుతుందట. రౌడీ మూక ఒక ఇంట్లోని సామానులు బైటికి విసిరేస్తారట. ఆ క్రమంలో వివేకానందుడి ఫోటో ను కూడా విసిరేస్తుంటే.. దాన్ని ఒక చెయ్యి వచ్చి అందుకుంటుందట. ఆ చెయ్యి పవన్ కళ్యాణ్ దట. ఈ సీన్ ను చాలా కాస్ట్లీగా , స్టైలిష్ గా రూపొందించాడట దర్శకుడు. అలాగే ఆయన్ ఫ్లాష్ బ్యాక్ సస్నివేశాలు కూడా అభిమానుల్ని మెప్పిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఆయన లా కాలేజ్ విద్యార్ధి నాయకుడిగా కనిపిస్తారట. అప్పుడే శ్రుతి హాసన్ .. పవర్ స్టార్ కు పరిచయమవుతుందట. వీరిద్దరి మీద వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయని వినికిడి.
Also Read : వకీల్ సాబ్ కు పోటీగా లాయర్ సాబ్?











