చాలామంది ఉద్యోగులు చేస్తుంటారు. కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనం కోసం జాబ్ చేసేవాళ్లు కొందరైతే, పనిని దైవంగా భావించి అంకితభావంతో పనిచేసేవాళ్లు మరికొందరు. ఇందులో రెండో రకానికి చెందుతాడు ఇఫ్తేఖర్ రెహమానీ అనే ఉద్యోగి. అతని పని తీరును మెచ్చిన ఓ సంస్థ ఏకంగా చంద్రమండలంపై ఒక ఎకరం స్థలాన్ని గిఫ్ట్ ఇచ్చింది. ‘చాంద్ కా తుక్ డా’ అంటూ ప్రతిఒక్కరూ ఇఫ్తేఖర్ రెహమానీను అభినందిస్తున్నారు. ఎఆర్ స్టూడియోస్ అనే సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ కంపెనీలో నోయిడాలో పనిచేస్తుంది. ఇఫ్తేఖర్ లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే అమెరికన్ కంపెనీ కోసం ఒక సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేశాడు. ఈ కంపెనీ చంద్రమండలంపై భూములను క్రయవిక్రయాలను చేస్తోంది. అయితే ఇఫ్తేఖర్ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తయారుచేసి, భూములు అమ్ముడుపోయేలా తనవంతు సహకారం అందించాడు. దీంతె ఇఫ్తేఖర్ పనితీరును మెచ్చిన ఆ సంస్థ చంద్రమండలంలో ఒక ఎకరం గిఫ్ట్ గా ఇచ్చింది. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్, షారూఖ్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖలు చంద్రుడిపై భూమిని కలిగి ఉన్నారు. వాళ్ల సరసన ఇఫ్తేఖర్ నిలువనున్నాడు. కంపెనీ ఓ ఉద్యోగికి చంద్రమండలం స్థలం ఇచ్చిందనే వార్త వైరల్ అవుతోంది.
Also Read : పంజాబ్ సీఎం సలహాదారుగా పీకే.. పారితోషికం రూ.1











