సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ లో పాల్గొని.. గ్యాప్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హీరోల్లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లు ముందు వరుసలో ఉంటారు. ‘సర్కార్ వారి పాట’ సినిమా దుబాయ్ లో ప్రారంభం కావడానికి ముందు.. మహేశ్ బాబు తన కుటుంబ సమేతంగా అక్కడ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లుఅర్జున్ వంతు వచ్చింది.
ఇటీవల బన్నీ ‘పుష్ప’ సినిమా లాంగ్ షెడ్యూల్స్ లో పాల్గొని.. ఇప్పుడు కాస్తంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతగాడు కుటుంబ సమేతంగా దుబాయ్ లో తేలాడు. అక్కడ ఒక థీమ్ పార్క్ లో అల్లుఅర్జున్ .. తన పిల్లలు అయాన్, అర్హాలతో ఆడుకుంటూ కనిపించాడు. అల్లు అర్హతో ఒక గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- ప్రేమికుల రోజున మహేష్, అల్లు అర్జున్ లకు గిఫ్ట్ లు
Stylish Star @alluarjun & his family visited one of the famous theme park @bollywoodparks during their recent holiday trip to #Dubai #AlluArha pic.twitter.com/5hpjxczoJr
— BA Raju's Team (@baraju_SuperHit) February 24, 2021











