టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్స్ సరసన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది రష్మికా మందన్న . కేవలం ఐదేళ్ళలోనే టాలీవుడ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అందం, అభినయం కలబోసిన ఈ శాండిల్ వుడ్ సుగంధం.. మదర్ ల్యాండ్ కన్నడ భాషలో సెలెక్టివ్ గా వెళుతూ…. టాలీవుడ్ , కోలీవుడ్ లో మాత్రం మెయిన్ ఫోకస్ పెడుతూ దూసుకెళుతోంది. ఇప్సుడు ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ జెండా పాతడానికి సిద్ధపడుతోంది.
‘మిష్టర్ మజ్ను’ చిత్రంతో రష్మిక బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే సిద్ధార్ధ మల్హోత్రా లాంటి యంగ్ హీరో సరసన నటించే అవకాశం అందుకున్న ఈ సుందరి .. దీని తర్వాత ఏకంగా బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న డెడ్లీ అనే మూవీకి కూడా సైన్ చేసింది. ప్రస్తుతం రష్మికా గోల్ ఏంటంటే.. హిందీ భాష పూర్తిగా నేర్చుకొని.. తాప్సీ తరహాలో డిఫరెంట్ పాత్రల్లో నటించాలని చూస్తోంది. దాని కోసం ఒక హిందీ ట్యూటర్ ను కూడా నియమించుకుందట.
ఇదిలా ఉంటే.. అమ్మడు ముంబై లో ఓ పోష్ ఏరియాలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల మిష్టర్ మజ్ను సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన రష్మిక అక్కడ హోటల్స్ లో ఉండే పరిస్థితి వచ్చిందట. అందుకే ఆమెకి ఆ పద్ధతి నచ్చక ఏకంగా ఒక ఫ్లాటే కొనేసిందట. మొత్తం మీద అమ్మడు ముంబై లో స్థిర పడడానికి కావల్సిన ఏర్పాట్లను ముందు చేసేసుకుంది. ఫ్యూచర్ లో రష్మికా బాలీవుడ్ లో ఊపిరి సలపని విధంగా అవకాశాలొచ్చిపడితే.. అక్కడే సెటిలయ్యేందుకు కావల్సిన విధంగా అక్కడ ఓ పెర్మినెంట్ సెటప్ నే చేసేసుకుందన్నమాట. మరి రష్మికా జాతకం బాలీవుడ్ లో ఎలా ఉండనుందో చూడాలి.
Must Read ;- సౌందర్య బయోపిక్ లో చేయాలనుందన్న రష్మిక











