వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు.. 2014 నుండి 2019 వరకు జగన్ కోసం పోరాడిన అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలను .. పవర్‌లోకి రాగానే జగన్ వదిలేశారనే చర్చ ఉంది.. నేటికీ ఆయన తనకోసం పోరాడే పేటీఎమ్ బ్యాచ్ కోసం ఏమీ చేయరని, తన స్వార్ధం కోసం వాడుకుంటూ ఉంటారని కొంతమంది ఓపెన్‌గా వీడియోలు, పోస్టులు పెడుతుంటారు.. తాజాగా జగన్ అంటే వీరావేశం ప్రదర్శించే ఆయన వీరాభిమాని, జగన్ కోసం ఇతర పార్టీల నేతలను బూతులు తిట్టి మరీ వైసీపీకి సేవ చేస్తున్న అభిమాని కష్టాలలో ఉంటే వైద్యానికి సాయం కూడా చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
కృష్ణారెడ్డి… ఎన్‌ఆర్‌ఐ… అమెరికాలో నివసిస్తున్నాడు.. జగన్ అంటే వీరాభిమానం. జగన్ కోసం బూతు పోరాటం చేస్తుంటాడు సోషల్ మీడియాలో.. యూఎస్‌లో స్టడీస్ కోసం వెళ్లాడో, లేక ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు కానీ, హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు.. తోటి మిత్రులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.. అయితే, వైద్యానికి భారీగా ఖర్చు అవుతోందని తెలిపారు వైద్యులు..
చికిత్సకి కృష్ణా రెడ్డి కుటుంబం ఆర్ధిక సామర్ధ్యం సరిపోవడం లేదట.. దీంతో, అమెరికాలోని కొందరు మిత్రులు గో ఫండ్ మీ పేజ్‌లో ఫడ్ రెయిజింగ్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారు.. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు సహకరిస్తున్నారు.. జగన్ కోసం పరితపించే కృష్ణారెడ్డిని కాపాడాలని వైసీపీ అగ్ర నాయకత్వానికి కొంతమంది రిక్వెస్ట్‌లు పంపుతున్నారు.. కొంత ఆర్ధిక సాయం చేయాలని కోరుతున్నారు.. జగన్ బర్త్ డే కార్యక్రమాలలో బిజీలో ఉన్న ఆ నేతలు తర్వాత మాట్లాడదాం అని తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది.. మరి, జగన్‌ని విపరీతంగా అభిమానించే కృష్ణా రెడ్డిని వైసీపీ నేతలు ఆదుకుంటారా.? లేదా.? అనే అంశం ఎన్‌ఆర్‌ఐ వైసీపీ మిత్రులలో చర్చనీయాంశంగా మారింది..











