టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు(72) కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడకు చెందిన బాస్కర రామారావు టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం తెలిపారు.
Must Read ;- టీడీపీ నేత కాగిత వెంకట్రావు కన్నుమూత











