తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావు (71 )కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట్రావు అనేక పదవులు నిర్వహించారు.గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉండటంతో ముందుగా మచిలీపట్నంలో చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఆయన ఇవాళ మృతి చెందారు.
పలు పదవులకు వన్నెతెచ్చారు
కృష్ణా జిల్లా పెడన నుంచి ఫలు దఫాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత వెంకట్రావు పలు పదవులు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా, టీటీడీ ఛైర్మన్‌గా, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. కుమార్తె వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. వెంకట్రావు మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పలువరు టీడీపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Must Read ;- కరోనాతో టీడీపీ కార్పొరేటర్ మృతి











