Kohli Shared Vamika Pics Going Viral In Social Media :
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏదీ చేసినా విభిన్నమే. ఆటగాడిగా గ్రౌండ్ లో అడుగుపెడితే చాలు.. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టాల్సిందే.. బౌలర్ ఎవరైనా సరే పరుగుల వరద పారాల్సిందే.. స్వదేశంలోనే కాకుండా విదేశీ పిచ్ లపై రాణించిన ఘనత విరాట్ దే. ఆటగాడిగా రాణిస్తూ.. కెప్టెన్ గానూ భారత్ కు ఒంటిచెత్తో ఎన్నో విజయాలను అందించాడు. అయితే క్రికెట్ పట్ల ఎంత బాధ్యతయుతంగా ఉంటాడో.. ఫ్యామిలీ పట్ల అంతే బాధ్యతగా ఉంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా.. ఫ్యామిలీతో గడపడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. కూతురు వామిక పుట్టినప్పట్నుంచే కోహ్లీలో దూకుడు స్వభావం కొంచెం తగ్గిందని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు.
వామికతో ఆటవిడుపు
సిరీస్ కోసం విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ వెళ్లాడు. మ్యాచుల ప్రారంభానికి సమయం ఉండడంతో తన భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ లోని ముఖ్యమైన టూరిస్టు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. భార్య అనుష్క, కూతురు వామికతో ఆనందంగా గడుపుతున్నాడు. అయితే వామికకు ఆరు నెలలు నిండడంతో కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారు.
ఫొటోలు వైరల్
ఇప్పటివరకు విరుష్క జంట తమ గారాలపట్టి కూతురు ఫొటోలను బయటపెట్టలేదు. ఎయిర్ పోర్టుల్లో, పలు ప్రయాణాల్లో ఎక్కడా కూడా తమ కూతురు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా కూడా వామిక ఫొటోలు ఒక్కటి కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో విరుష్క జంట వామిక ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే.. వామిక ముఖం కనపడకుండా జాగ్రత్త పడ్డారు. పాప ఒక్క నవ్వుతో తమ ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందంటూ అనుష్క పేర్కొంది. తమ జీవితాలు ఎప్పటికీ ఇలాగే హాయిగా సాగిపోవాలని కోరుకున్నారు. విరాట్ కోహ్లీ కూతురి ఫొటోలను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Must Read ;- ఆ యువతి క్యాచ్ మహాద్భుతం!











