డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలయ్యింది. దీంతో మరోసారి కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు… విరాట్ కోహ్లీకి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కెప్టెన్‌గా ఇంత వరకు కోహ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా కైవసం చేసుకోలేదు. ఆటగాడిగా అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నా.. కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నారనే ఆరోపణలు తరచుగా వస్తున్నాయి. కెప్టెన్ కోహ్లీ… రెండు సార్లూ కేల్ జేమిసన్ బౌలింగ్‌లో అవుట్ కావడం కూడా తీవ్ర విమర్శలొస్తున్నాయి. చివరి మెట్టుపై బోల్తాపడటంతో ఇండియాకు అలవాటుగా మారిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలని తెగ కామెంట్లు చేస్తున్నారు.
కెప్టెన్సీపై అనుమానాలు
ఆటగాడిగా ఎన్నో రికార్డులు అందుకున్నవిరాట్.. కెప్టెన్సీలో ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పించాలని పలువురు మాజీ కెప్టెన్ లు సైతం బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా కోహ్లీ కెప్టెన్సీపై అనుమానాలు వ్యక్తం చేశాడు. కెప్టెన్సీలో కోహ్లీ కన్నా రోహిత్ శర్మకు మంచి రికార్డ్ ఉందని, ఎన్నో విజయాలు అందుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీతో పోల్చితే రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అని అన్నారు. 2018 ఆసియా కప్ లో రోహిత్ ను చాలా దగ్గరగా గమనించానని, స్టాండిన్ కెప్టెన్ గా ఎలాంటి ఒత్తడి లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటాడని అన్నారు. ట్రోఫీలకు, కెప్టెన్సీకి మెలిక పెట్టలేమని, కోహ్లీకి అదృష్టం కూడా కలిసిరావడం లేదని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ తన దూకుడు తగ్గించుకుంటే.. కెప్టెన్ గా రాణించే అవకాశాలు ఉన్నాయని సల్మాన్ భట్ అన్నాడు.











