తెలివి ఉండాలే కానీ.. ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ. అదే సెలబ్రిటీలకు అయితే.. బాగా ఈజీ. సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. వాళ్లు పెట్టే పోస్ట్ ల ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారు. క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా తదితరులు ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోట్లలో ఆదాయం పొందుతారంటే అతిశయోక్తి కాదు. ఇది నిజంగా నిజం. ఇటీవలే హాపర్ హెచ్ క్యూ అనే సంస్థ సెలబ్రిటీల ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె అశ్రిత కూడా ఉండడం విశేషం.
హాపర్ హెచ్ క్యూ జాబితాలో వరల్డ్ వైడ్ గా అశ్రితకు 377వ స్థానం దక్కింది. అదే ఆసియాలో చూస్తే ఆమె 27వ స్థానంలో ఉంది. అశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు సుమారుగా రూ.29 వేలు లబిస్తాయని సమాచారం. ఇంతకీ.. అశ్రిత పోస్టుల్లో ఏముంటుంది అంటే.. కుకింగ్ వీడియోలు. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే అకౌంట్ తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటుంది.
లవ్ మ్యారేజ్ చేసుకున్న అశ్రిత ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటోంది. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరిగింది. అప్పటి నుంచి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో నివసిస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా ఫోలోవర్స్ ను పెంచుకుని.. మరింత ఆదాయం సంపాదించి.. వరల్డ్ వైడ్ గా.. అలాగే ఆసియాలో మరింత మెరుగైన స్ధానాన్ని సంపాదిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- మిథాలీ ఘనత : ఇండియా రికార్డును బీట్ చేయడం కష్టమే!











