విరుష్క జోడీ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. ఓ వైపు విరాట్, మరోవైపు అనుష్క శర్మ ఇద్దరూ.. సెలబ్రిటీలే! దీనివల్ల వీరికి సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతుంది. ఇటీవలే కోహ్లీ భార్య అనుష్కశర్మ గురించి ఓ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అందాన్ని వర్ణిస్తూ… దాన్ని కోహ్లీ కుంగుబాటుకు లింకు పెట్టేశాడు. దీంతో ఇప్పుడీ వార్త తెగ వైరల్ అవుతోంది.

సరదాగా స్పందించిన మాజీ వికెట్ కీపర్..
అనుష్క లాంటి అందమైన భార్య ఉండగా విరాట్ కోహ్లీ కుంగుబాటుకు ఎలా లోనయ్యాడని భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ ఆశ్చర్యపోయారు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన సమయంలో తాను డిప్రెషన్‌కు లోనయ్యానని టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇటీవల వెల్లడించారు. దీనిపై సరదాగా స్పందించారు మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్. దీనిపై ఓ క్రీడా పత్రిక ఫేస్‌బుక్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అనుష్కలాంటి ముగ్దమనోహరమైన భార్య ఉండగా విరాట్ నిరాశకు గురికావడమా? అతడికి ఓ బిడ్డ కూడా పుట్టింది. భగవంతుడికి అతడు పలు విధాలుగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది’. కుంగుబాటు అనేది పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉంటుంది.
– ఫరూఖ్ ఇంజనీర్, భారత మాజీ క్రికెటర్











