సూపర్ స్టార్ మహేష్ బాబు, గీతా గోవిందం ఫేమ్ డైరక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్. జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా మహేష్ అందరికంటే ముందుగా ప్రకటించాడు. దీంతో సంక్రాంతికి సర్కారు వారి పాట రావడం ఖాయమని.. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఊహించని విధంగా సంక్రాంతి బరిలోకి దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ వచ్చింది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఎప్పుడైతే.. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారో అప్పటినుంచి సర్కారు వారి పాట విడుదల వాయిదా పడుతుందని.. జక్కన్న కోసం మహేష్ తన చిత్రాన్ని వాయిదా వేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా..? కాదా..? అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా మారింది.
అయితే.. ఈ రోజు ఆ సస్పెన్స్ కి తెర దించేశారు మహేష్ బాబు. సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా 2022 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మహేష్ ట్విట్టర్ లో సర్కారు వారి పాట న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. న్యూ పోస్టర్ రిలీజీ్ చేశారు. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సో.. సర్కారు వారు వచ్చేది సంక్రాంతికి కాదు.. వేసవికి.
Must Read ;- విజువల్ వండర్ గా ట్రిపుల్ ఆర్ గ్లింప్స్











