Rajamouli Has Locked The Run Time Of RRR 2hrs 45min
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండడంతో భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దసరాకి రావాల్సిన ఈ భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో రాజమౌళి ప్రమోషన్స్ ప్రారంభించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. షూటింగ్ చేసిన మొత్తాన్ని రఫ్ కట్ చేస్తే దాదాపు 3 గంటలు వచ్చిందట. దీనిని 2 గంటల 45 నిమిషాలు వచ్చేలా ఎడిటింగ్ చేయనున్నారని తెలిసింది. సో.. ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అని సమాచారం. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు ఉత్కంఠతో చూసేలా ఉంటుందట. బాహుబలితో చరిత్ర సృష్టించడంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
Rajamouli Has Locked The Run Time Of RRR 2hrs 45min
అయితే.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా ఆర్ఆర్ఆర్ అందర్నీ మెప్పిస్తుంది అని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. సంక్రాంతికి వారం రోజులు ముందే రిలీజ్ అవుతుండడం.. ఆతర్వాత వరుసగా సంక్రాంతి సెలవులు రావడం.. ఆర్ఆర్ఆర్ కు బాగా కలిసొస్తుంది. అందుకనే జక్కన్న ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బాహుబలి 2 తో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించిన జక్కన్న ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్ని కోట్లు కలెక్ట్ చేయనున్నారు.? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది.