సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకుల్లో జరిగే మోసాలు.. ఈ ఆర్ధిక నేరాలను బయటపెట్టి.. వాళ్ల అంతు చూడడమే లక్ష్యంగా రంగంలోకి దిగే ఆఫీసర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే బ్యాలెన్స్ సన్నివేశాలు కూడా పూర్తి చేస్తున్నారు.
మహేష్.. కీర్తి సురేష్ పై రెండు పాటలు అక్కడే చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ రెండు పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. నవంబరు 4న దీపావళి సందర్భంగా అభిమానుల కోసం సర్కారు వారు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏంటా స్పెషల్ ట్రీట్ అంటే.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
సర్కారు వారి స్పెషల్ ట్రీట్ రాబోతోందని థమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ పాటకు మంచి ట్యూన్స్… ట్రాక్ కుదిరాయని… పాట సాహిత్యం అద్భుతంగా ఉందని చెప్పకనే చెప్పారు. దీనిని బట్టి మహేష్ అభిమానులకు దీపావళి స్పెషల్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుందని అర్థం అవుతుంది. ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్.. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో సర్కారు వారి పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ చేయాలనేది ప్లాన్. అన్నీ అనుకున్నట్టు జరిగి సంక్రాంతికి సర్కారు వారి పాట విడుదల అయితే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ రావడం ఖాయం అంటున్నారు అభిమానులు.











