నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో అనుదీప్ కెవీ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ లో సైతం దుమ్మురేపింది. అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్లానింగ్ లో ఉంది.
అలాంటి ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్రలు పోషించిన నవీన్, రాహుల్, ప్రియదర్శి లతో పాటు , కథానాయికగా నటించిన అందాల సుందరి ఫరియా అబ్దుల్లాకి కూడా అంతే క్రెడిట్ దక్కుతుంది. చిట్టి అనే అల్లరి పాత్రలో చిలిపితనం, కొంటెదనం కలబోసిన .. గ్లామరస్ బ్యూటీ గా ఆమె ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకుంది. అందుకే ఈ బ్యూటీకి ఈ సినిమా తర్వాత బోలెడన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి.. దీనికి తోడు హైట్ కూడా ఆమెకి అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది.
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లాకి ఏకంగా నాలుగు సినిమాల్లో అవకాశమొచ్చిందని వినికిడి. వాటిలో రెండు సినిమాలు పెద్దబ్యానర్స్ లో రూపొందనున్నాయి. మరో రెండు సినిమాలు మీడియం బడ్జెట్ మూవీస్ అని తెలుస్తోంది. త్వరలోనే రెండు సినిమాల అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. అంతేకాదండోయ్… ఈ సినిమాలతో ఆమె పారితోషికం కూడా బాగానే పెంచేస్తోందట. మరి ఈ సినిమాలతో ఫరియా అబ్దుల్లా రేంజ్ ఇంకెంతగా పెరగుతుందో చూడాలి.
Must Read : అవకాశాల వెల్లువలో ‘జాతిరత్నాలు’ సుందరి











