తెలుగు ప్రేక్షకుల్ని నాలుగు సీజన్ల పాటు .. విశేషంగా అలరించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అని అందరికీ తెలిసిందే. యన్టీఆర్, నానీ, నాగార్జున హోస్టింగ్స్ తో అత్యధిక జనాదరణ పొందింది ఈ నేపథ్యంలో దీని నిర్వాహకులు ఇప్పుడు 5వ సీజన్ సన్నాహాల్లో ఉన్నారు. లాస్ట్ సీజన్ లోని కంటెస్టెంట్స్ ను కరోనా కారణంగా.. మూడు వారాలపాటు అబ్జర్వేషన్ లో ఉంచి.. కరోనా నెగెటివ్ అని తేలిన తర్వాతే హౌస్ లోకి పంపించారు . అందుకే షో కూడా చాలా ఆలస్యంగా ప్రసారమైంది. అంటే సెప్టెంబర్ లో మొదలై.. డిసెంబర్ కు ముగిసింది.
బిగ్ బాస్ సీజన్ 5 కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా లేట్ గా ప్రసారం అయ్యే అవకాశాలున్నాయంటు న్నారు. సరిగ్గా ఈ సీజన్ ను కూడా సెప్టెంబర్ లో మొదలు పెట్టి.. డిసెంబర్ నాటికి ముగించే ప్లాన్ చేస్తున్నారట. నిజానికి .. జూన్ లేదా జూలై నాటికి మొదలు పెట్టాలని ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడూ కరోనా కారణంగా జాప్యం తప్పడం లేదు.
ఇప్పటికే బిగ్ బాస్ 5 కోసం చాలా మందిని ఇంటర్వ్యూ చేశారట. అయితే కోవిడ్ కారణంగా షో ప్రసారాన్ని సెప్టెంబర్ కు వాయిదా వేస్తున్నారట . ఇక లాస్ట్ సీజన్ లాగానే ఇందులో కూడా ప్రముఖ టాలీవుడ్ కేరక్టర్ ఆర్టిస్టులు, యూ ట్యూబ్ స్టార్స్ , ప్రముఖ సాంకేతిక నిపుణులు .. కంటెస్టెంట్స్ గా అలరిస్తారట. అలాగే.. హోస్ట్ గా ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జునే రానున్నారు. మరి ఈ సీజన్ వీక్షకుల్ని ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
Must Read ;- చిత్ర పరిశ్రమలో కరోనా ప్రమాద ఘంటికలు











