నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ మూవీ జాతిరత్నాలు . అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్వప్నా సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇప్పటికీ ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మంచి వసూళ్ళను రాబడుతోంది. ఈ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే లాభాల బాటలో ఉన్నారు.
ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. కరోనా తర్వాత ఓవర్ సీస్ లో ఇంతటి స్థాయిలో వసూళ్ళను కురిపించిన మొదటి భారతీయ సినిమాగా ‘జాతిరత్నాలు’ నిలిచిపోయింది. మార్చ్ 10న అమెరికాలో విడుదలైన ఈ సినిమా మొదటి వారం 800కే డాలర్స్ వసూలు చేసింది. మూడో వారంలో 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.
Must Read ;- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో ‘ఉప్పెన’ హీరో?











