తనను కాదన్న సీఎంకి తొడగొట్టి మరీ సవాల్ విసిరినట్లుగా.. లీగల్ ఫైట్ చేసి మళ్లీ తన కుర్చీలో కూర్చొన్నప్పుడు అందరూ గర్వంగా, హ్యాపీగా ఫీలయ్యారు.. ఒక్క జగన్ బ్యాచ్ తప్ప. అలాంటి నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు పెట్టడానికి కూడా పట్టుబట్టినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. చివరకు ఇక్కడ కూడా లీగల్‌గా గెలిచి.. ఎన్నికల నోటిఫికేషన్ ఇఛ్చారు. ఇక జగన్ ఆటలు చెల్లవు.. వైసీపీ వాళ్లు ఎవరినీ బెదిరించలేరు.. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేరు.. పోలీసులు నిజాయితీగా పని చేస్తారని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. కాని జరుగుతున్నది చూస్తుంటే ఏమనాలో అర్ధం కావటం లేదు.
పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే మరింత కమిటెడ్‌గా..
పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే మరింత కమిటెడ్‌గా పని చేస్తూ.. వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్యర్ధి క్యాండేట్‌ని అరెస్ట్ చేయమంటే చేసేస్తున్నారు. కేసు పెట్టమంటే పెట్టేస్తున్నారు. నామినేషన్ వేయనీయకుండా బెదిరించడం.. ఒక వేళ వేసినా.. విత్ డ్రా చేసుకునేలా బెదిరించడం అన్నీ నడిచిపోతున్నాయి. ఆఖరికి పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో సైతం గెలిచినోళ్లను కూడా ఓడినట్లు ప్రకటించేయడం మన అధికారులకే చెల్లింది. అంత ఘోరంగా నడిచిన ఎన్నికలు కూడా విజయవంతంగా ప్రశాంతంగా పూర్తయినట్లు ప్రకటించడం నిమ్మగడ్డకే చెల్లింది. నిజంగా ఈ ప్రకటన అందరికీ షాకిచ్చింది.

దాదాపు 80కి పైగా లేఖలు..
మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు దాదాపు 80కి పైగా లేఖలు రాశారు. ఒక్క లేఖకు సమాధానం లేదు.. రియాక్షన్ లేదు. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు నిమ్మగడ్డ అని ఆరోపణలు చేసేవారు.. ఈ దెబ్బకు ఇక ఆ ముక్క మాట్లాడటం మానేశారు. ప్రతి దానికి ముందు ఒక లేఖ సీఎస్ కు రాసి యాక్షన్ తీసుకోమని చెప్పడం.. అది జరగకపోతే జరగటం లేదని గవర్నర్‌కు లేఖ రాయడం.. కామన్ అయిపోయింది. ఒక నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వడం.. దాని మీద మీడియాలో బ్రేకింగ్స్ రావడం అలవాటైపోయింది. కాని వాటి అమలు మాత్రం దేవుడే దిక్కన్నట్లు తయారైంది. ఏ నిర్ణయం అమలు కావటం లేదని తెలుస్తూనే ఉన్నా.. మీడియాలో వస్తూనే ఉన్నా.. అధికారులకు, పోలీసులకు నిమ్మగడ్డ అభినందనలు తెలియచేయడమే ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.
ప్రజాస్వామ్యం అపహాస్యమైనా సరే..
నిమ్మగడ్డ రమష్ కుమార్‌కు పదవి అన్యాయంగా తీసేశారు. దానిని తిరిగి తెచ్చుకున్నారు. తానుండగా ఎన్నికలు పెట్టకూడదని జగన్ అనుకున్నారు.. కాని తానుండగానే పెట్టించారు.. అంతే మొగాంబో ఖుష్ హువా.. సాటిస్ ఫై అయిపోయారు. ఇక ఎవరు ఏమైపోతే ఏముంది.. జనం ఏమైనా.. ప్రజాస్వామ్యం అపహాస్యమైనా సరే.. తాననుకున్నది జరిగితే చాలు.. ఫుల్లు ఖుష్.. అదీ పరిస్థితి.
Must Read ;- బలవంతపు ఉపసంహరణలపై చర్యలు: నిమ్మగడ్డ











