జాతిరత్నాలు’ సూపర్ హిట్ అయి.. మంచి వసూళ్ళను రాబడుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ హ్యాంగోవర్ లో ఉన్నాడు కొత్త దర్శకుడు అనుదీప్ కెవీ. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి .. నవ్వుల పెర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ అనుదీప్ టాలెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి అతడికి ఓ బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందట. అంతేకాదు.. దీంతో అతడికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చి పడిందని టాక్.
త్వరలోనే అనుదీప్ రామ్ కు స్టోరీ నెరేట్ చేయబోతున్నాడట. ఒకవేళ రామ్ కి ఆ కథ నచ్చితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. జాతిరత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ .. రికమెండేషన్ తోనే అనుదీప్ కు వైజయంతి లాంటి బ్యానర్ లో అవకాశమొచ్చిందని తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం లింగ్ సామి దర్శకత్వంలో తెరకెక్కనున్న బైలింగ్విల్ మూవీ హడావిడిలో ఉన్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయిక గా నటిస్తోంది.
రామ్ పోతినేని తో అనుదీప్ సినిమా వర్కవుట్ అయితే… అతడికి టాలీవుడ్ నుంచి మరిన్ని పెద్ద అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు అనుదీప్ తో సినిమా చేయడానికి ముందుకొస్తున్నారట. అయితే .. అతడు మాత్రం రామ్ సినిమాకే మొదటి ప్రాధాన్యతనిస్తాడని అంటున్నారు. మరి రామ్ తో అతడి సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ మెచ్చిన ‘జాతిరత్నాలు’











