తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అతడి ప్రతీ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. మంచి వసూళ్ళు సాధిస్తాయి. ఎర్లియర్ గా అతడు నటించిన ఆకాశం నీ హద్దురా తెలుగు వెర్షన్ కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సూర్య కన్ను ఇప్పుడు టాలీవుడ్ మీద పడిందని సమాచారం. తన బ్యానర్ లో చిన్న సైజు సినిమాలు నిర్మించాలన్నది అతడి ప్లాన్. భార్య జ్యోతికతో సూర్య నిర్మించే సినిమాలన్నీ ఆ బ్యానర్ లోనే రూపొందాయి.
తాను నిర్మించే సినిమాల్లో సూర్య నటించడట. అంతేకాదు.. ఆ సినిమాలు కేవలం తెలుగులోనే విడుదలవుతాయట. దానికోసం ప్రత్యేకంగా కథలు వింటున్నాడట. ఈ ప్రాసెస్ కోసం తెలుగులో ఒక పార్టనర్ ని వెతుక్కున్నాడట. టాలీవుడ్ లో ఒక అగ్ర నిర్మాణ సంస్థతో అతగాడు చేతులు కలుపుతున్నాడట. ఇంతకీ ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏది? అతడు నిర్మించే సినిమాల్లో హీరోలు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- సూర్యకు చుక్కెదురు.. ఆస్కార్ బరిలో ఇవే