మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టిన రోజు సందర్భంగా తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అన్నిటికంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ ‘‘మన ఒకే ఒక్క మెగాస్టార్ ఇలాంటి ఆనందమైన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా హృదయం ఎప్పుడూ గౌరవం, ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఆయన నా నిజమైన ‘ఆచార్య’. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి’’ అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు అల్లు అర్జున్. గంగ్రోతి సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి స్టైలిష్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. మొత్తం మెగా కాంపౌండ్ హీరోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత స్థానం అల్లు అర్జున్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, చిరు ఇన్సిరేషన్ తోనే ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌లో ప్రావిణ్యం తెచ్చుకొని ప్రస్తుతం తన సినిమాలతో టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్.
ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో మరో సినిమా రెడీగా ఉంది. ఎప్పటికైనా హీరోగా చిరంజీవితో కలిసి నటించాలన్నది అల్లు అర్జున్ డ్రీమ్. ఈ విషయాన్ని చాలా సార్లు బయటపెట్టారు. మరి త్వరలోనే చిరు, అల్లు అర్జున్ కలయికలో ఎదైనా భారీ రేంజ్ మల్టీస్టారర్ వస్తుందేమో చూడాలి.
చిరంజీవి లూసిఫర్ చిత్రం చేస్తున్నారు. అందులో మరొక యువ స్టార్ కు పాత్ర ఇవ్వడానికి అవకాశం ఉంది. పెద్ద నిడివి ఉన్న పాత్ర కాదు. కానీ.. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచే తెలుగు ‘లూసిఫర్’లో ఫలానా పాత్రను ఫలానా వారు చేయబోతున్నారంటూ అనేక రకాల కాంబినేషన్ పుకార్లు వస్తున్నాయి. మరి అది పట్టాలెక్కే సమయానికి ఎవరు ఖాళీ ఉంటారో.. అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.











