కేంద్రంలోని BJP ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వచ్చిన వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉండడంతో..మారుతున్న జాతీయ సమీకరణాలకు అనుగుణంగా జగన్ తన దృష్టిని విపక్ష ఇండి బ్లాక్ వైపు మళ్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఇండి కూటమి చేపట్టిన ఆందోళనకు జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఈ మార్పునకు స్పష్టమైన నిదర్శనం.
ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వడంతో పాటు ఎన్నికల వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలంటూ జగన్ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో జరుగుతున్న వ్యవహార శైలిపై పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాల్సిన రాజ్యాంగబద్ధ వ్యవస్థల ఎంపికలో మార్పులు రాకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరిస్తూ, తక్షణమే విప్లవాత్మకమైన ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ఐతే గతంలో ఇదే జగన్ ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో మార్పులు చేస్తూ తెచ్చిన చట్టానికి మద్దతు పలికారు.
రాష్ట్ర రాజకీయాల ప్రభావం జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరిపై స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన NDA కూటమిని ఢిల్లీ స్థాయిలో ఢీకొట్టేందుకు జగన్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ఇక, ఇండి కూటమిలో అధికారికంగా చేరడమే మిగిలింది. గతంలోనే AICC పెద్దలతో బెంగళూరులో జగన్ రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఏళ్ల తరబడి కేసుల భయంతో కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ వచ్చిన జగన్, ఉన్నట్టుండి జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఆందోళనలో భాగస్వామి కావడం ఏపీ రాజకీయాల్లోనూ కొత్త పరిణామాలకు దారితీసింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన..











