తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఎన్నో అపోహలు ఉండేవి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రాకపోవడమే కాదు, ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతాయనే ప్రచారం, ఆపోహలు వెంటాడాయి. కానీ రాష్ట్ర ఏర్పాటు తురవాత తెలంగాణ అభివృద్ధిలో తన ప్రత్యేకత చాటుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానం లాంటి ఎన్నో సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం మరింత అనుకూలమైన ప్రాంతమనే నమ్మకాన్ని వ్యాపారులకు కల్పించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. దాంతో రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత పదుల సంఖ్యలో దిగ్గజ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) ముందుకు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా ఈ రోజు ప్రకటించారు.
2,761 కోట్ల రూపాయాల పెట్టుబడులతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తద్వారా 2022 నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈమేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అయితే ఈ పెట్టుబడులను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే.
ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వం విధానాలకు ఉన్న ప్రాదాన్యత ఏమిటో అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకమైన, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో తాను అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. పెట్టుబడులకు డేటా సెంటర్లు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తెలంగాణ మారుతుందనే విశ్వాసాన్ని కేటీఆర్ తెలిపారు. దీంతో అమెజాన్ సంస్థ- తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే పెట్టుబడులు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉంది.
Happy to announce the largest FDI in the history of Telangana! After a series of meetings, AWS has finalized investment of ₹20,761 Cr ($ 2.77 Bn) to set up multiple data centers in Telangana
The @AWSCloud Hyd Region is expected to be launched by mid 2022#HappeningHyderabad pic.twitter.com/XuGxFfSFsS
— KTR (@KTRTRS) November 6, 2020