సన్నీలియోన్ అనే పేరు వినగానే, కలలో కాకుండా నిజంగానే వచ్చేసిందేమోననుకుని కుర్రాళ్లు ఉలిక్కిపడి నిద్రలేస్తారు. తమతో దోబూచులాడుతుందేమోనని పరిగెత్తుకు వెళ్లి ఆ చుట్టుపక్కల వెతుకుతారు. సన్నీలియోన్ పేరుకు అంతటి పవర్ ఉంది మరి. సన్నీలియోన్ పోస్టర్ లేని బ్యాచ్ లర్ రూమ్స్ కనిపించవు .. సన్నీలియోన్ పేరును మంత్రంలా జపించని పడుచు మనసులు ఉండనే ఉండవు. ఆమె ఎక్కడ ఎలా ఉన్నా ఆమెను చూస్తూనే కుర్రాళ్లంతా తమ పనులు చేసుకుంటూ ఉంటారు. తమలోని ఉత్సాహానికి ఆమె అందచందాలకు మించిన ఔషధం లేదని వాళ్లంతా భావిస్తుంటారు.

కరోనా కారణంగా సోషల్ మీడియాలో కాస్త దూకుడు తగ్గించిన సన్నీలియోన్, మళ్లీ ఇప్పుడు తన జోరు చూపిస్తోంది.హాటుహాటు ఫోజులతో .. చూసేవాళ్లకి ఆకలిదప్పులు తెలియకుండా చేస్తోంది. తను కేరళ వెళ్లినప్పటి ఫొటోలను పోస్ట్ చేసి, తన సొగసులు కేరళ కొబ్బరితో పోటీ పడుతున్నాయని చెప్పకనే చెప్పింది. కేరళ సంప్రదాయ పద్ధతిని టచ్ చేస్తూ బంగారు అంచుకలిగిన గులాబీరంగు వస్త్రాన్ని చుట్టేసింది. అంతేకాదు జూకాలు పెట్టేసి .. చేతినిండుగా గాజులు తొడిగేసి .. నుదుటున గంధం బొట్టును కూడా దిద్దేసింది.

సముద్రంలో .. పడవపై కూర్చుని, తడిసిన కురులను ఆరబోసుకున్నట్టుగా ఒక పోజు ఇచ్చింది. సన్నీ కేరళలో ఉన్నా .. కెనడాలో ఉన్నా, పడవెక్కినా .. విమానమే ఎక్కినా, ఆమె సముద్రంలో ఉన్నా .. నేలపై ఉన్నా ఆమె అందం పెరిగేదే తప్ప తరిగేది కాదుగదా. ఆమె మేనిలో అదే ఛాయా .. ఆమె కళ్లలో అదే కాంతి. ప్రాణాలు పోసుకున్న శృంగార దేవతలా .. కుర్రాళ్ల ఊహలకు ఊపిరిపోసే శృంగార దేవతలా ఆమె కనిపిస్తోంది. అందం ఎక్కడ ఉన్నా ఆకర్షిస్తూనే ఉంటుంది .. ఆరాధకులను తయారుచేసుకుంటూనే ఉంటుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది?
Must Read ;- అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!











