సన్నీలియోన్ ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆమె ఓ అందాల జలపాతం. ఆ అందాల జోరు చూడటానికీ .. ఆ సొగసుల హోరు వినడానికి కుర్రాళ్లంతా ఉబలాటపడుతుంటారు .. ఉత్సాహ పడుతుంటారు. తమ కలల వనంలో ఆమెను ఊహాసుందరిగా చేసుకుని ఊరేగుతుంటారు. మంచునీటిలో వేసిన మంచి ముత్యంలా .. పాలనురగలో తేలే పగడంలా ఆకర్షణీయంగా కనిపించే సన్నీలియోన్ కి కోడె వయసులో ఉన్నవాళ్లంతా అభిమానులే. అందాన్ని అర్చించే వాళ్లంతా ఆరాధకులే.
సన్నీలియోన్ ను నడిచే సౌందర్యంగా యూత్ భావిస్తుంది. అబ్బాయిలంతా ఆమెను తమ కలల దేవతగా భావిస్తారు. తమ కలల్లోకి ఆహ్వానించేసి మరీ ముసుగుతన్నుతారు. ఈ విషయం సన్నీకి కూడా తెలుసు అయినా ఎంతమాత్రం జాలి అనేది లేకుండా .. బ్యాచ్ లర్స్ అనే కనికరం కూడా లేకుండా ఆమె హాటు హాటు ఫొటోలను వదులుతూ ఉంటుంది. అలా స్విమ్మింగ్ పూల్లో .. బికినీ వేసిన జలకన్యలా ఆమె తేలుతూ ఒక ఫొటో షేర్ చేసింది. ఒళ్లంతా వెచ్చని కిరణాలకు అప్పగించేసి, కళ్లలో ఆ కాంతి పడకుండా హ్యాటు పెట్టుకుంది. ఆ హ్యాటుపై ఆమె పేరు ఉండటం .. ఆమె అల్లరితనానికి మరో నిదర్శనం.
స్విమ్మింగ్ పూలే కదా అని ఆమె ఎలా పడితే అలా దిగేయలేదు. కాలి గోళ్ల దగ్గర నుంచి కలర్ కాంబినేషన్ చూసుకుని కలర్ ఫుల్ గా దిగింది. ఫిట్ నెస్ అంటే ఇది అని చెప్పకనే చెబుతోంది. స్విమ్మింగ్ పూల్లో తెల్ల తాబేలులా తేలుతున్న సన్నీని ఎంతసేపైనా అలా చూస్తుండిపోవచ్చు. వీలైతే ఆ గట్టునే కూర్చుని కూనిరాగాలు తీయవచ్చు. కానీ వచ్చిన గొడవంతా ఆమె భర్త డేనియల్ వెబర్ తోనే. ఏదేనైనా సన్నీ అందాల తాకిడికి స్విమ్మింగ్ పూల్లో సునామీ పుట్టకపోవడం ఆశ్చర్యమే.
Must Read ;- సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!