సన్నీ లియోని.. ఈ పేరు వింటేనే కుర్రకారు హుషారెత్తుతుంది. ఇక.. సోషల్ మీడియాలో ఆమె కోసం వెతుకులాటకు అంతే ఉండదు. అలాంటిది హాట్ బ్యూటీ ఓ ఆసక్తిర విషయాన్ని పోస్టు చేస్తే ఇంకేమన్నా ఉందా? ఇంగ్లాండ్తో సిరీస్ ఆడేందుకు సిద్ధం.. అంటూ సన్నీ ఓ పోస్టు పెట్టిందంటే.. సోషల్ మీడియా అంతా హీటెత్తిపోయింది. కొద్ది నిమిషాల్లోనే హాట్ హాట్ కామెంట్ల వర్షం కురిసింది. ఇంతకీ ఆ పోస్టు ఏంటి? కుర్రకారును హీటెక్కించిన ఆ ప్రకటనేంటి?
సన్నీ సిక్సర్ కొడితే…
డేటింగ్ రియాలిటీ షో స్పిట్ల్స్‌విల్లా షూటింగ్ కోసం కేరళలో వెళ్లింది
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్. ఖాళీ సమయంలో సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో బ్యాట్తో బంతిని షాట్గా మలిచింది సన్నీ. ఇక తాను టీమిండియా జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ వీడియోను జతచేస్తూ చమత్కరించింది.
సన్నీ చమత్కారం.. కామెంట్ల వర్షం…
బ్యాట్ పట్టిన
సన్నీ సరదాగా ఓ పోస్టు పెట్టింది. భారత్ లో ఇంగ్లండ్ జట్టు పర్యటన నేపథ్యంలో.. ‘ఇంగ్లండ్‌పై బరిలోకి దిగేందుకు కిట్‌ను సర్దుకోవాలా?’ అంటూ చమత్కరించింది. సన్నీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.
ఇన్‌స్టాగ్రాంలో ఆ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ సిక్సర్ కొట్టావంటూ ఫైర్ ఎమోజీలను జతచేస్తూ కామెంట్స్ రాశారు. మిడిలార్డర్‌లో మీలాంటి డేంజరస్ బ్యాట్స్‌మెన్లు అవసరమని మరొకరు చమత్కరించారు. నైస్ షాట్ ఇంకొకరు డబుల్ మీనింగ్ తో రాసుకొచ్చారు. ఇలా.. సన్నీ పోస్టు పెట్టిన కొద్దిగంటల్లోనే కామెంట్ల వర్షం కురిపించారు.