సన్నీలియోన్ .. ఓ శృంగారదేవత .. ఆమెను గురించి కలలు కనని కళ్లు ఎందుకు? ఆమెను తలచుకోని బ్రతుకెందుకు? అనే పరిస్థితికి కుర్రాళ్లు వచ్చారంటే, ఆమె ఏ విధంగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ తెరపై ఆమెను చూసిన వాళ్లంతా అప్సరసల్లో నుంచి తప్పిపోయి వచ్చిందా? అమరలోకంలో ఇంతమంది ఎందుకు అనుకుని, ఇష్టపడే ఇక్కడికి వచ్చిందా? అనుకుని ఆశ్చర్యపోయారు. ఇలాంటి స్కిన్ టోన్ చూస్తే ఇంద్రుడికైనా మతిపోవలసిందేనని నోరెళ్లబెట్టారు.

అందం గా ఉండటం వేరు .. ఆ అందాన్ని అందంగా ఆవిష్కరించడం వేరు. ఈ విద్యను పూర్తిస్థాయిలో అభ్యసించిన భామగా సన్నీలియోన్ కనిపిస్తుంది. ఫిట్ నెస్ తో కూడిన ఆమె రూపం .. మత్తుమందు కూరినట్టుగా అనిపించే కళ్లు .. మకరందం నిండిన పెదాలు .. ఇలా సన్నీలియోన్ అణువణువూ అందమే .. అడుగడుగూ అందమే. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఆమె జోరు చూసి కంగారు పడియారంటే, ఆమె ఏ రేంజ్ లో తన దూకుడు చూపిందో అర్థం చేసుకోవచ్చు.

లాక్ డౌన్ కి ముందు ఆమె అమెరికా వెళ్లడం వలన, ఇక్కడి యువత కాస్త తేలికగా ఊపిరి తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ఆమె తిరిగి రావడంతో, కుర్రమనసుల మధ్య కలల యుద్ధం మళ్లీ మొదలైంది. తన హాట్ లుక్స్ తో ఇన్ స్టా ను మళ్లీ ఆమె దడదడలాడించేస్తోంది. తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్ తో ఆమె వదిలిన ఫొటోను చూసిన దగ్గర నుంచి కుర్రాళ్ల గుండెలన్నీ గుబులెత్తి పోతున్నాయి. ఆమె అణువణువునూ స్పర్శిస్తున్న ఆ సూరీడు ఎంత అదృష్టవంతుడోనని అనుకుంటున్నారు. ఈ అందాన్ని ఇలా చూడటం కోసమైనా ఆయుష్షు పెరగాలని ఆశపడుతున్నారు.
Must ead ;- సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!











