నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద మంత్రుల కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని మొదటి వాహనం బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పలేదు. కాన్వాయ్‌లో ఒకదాని కొకటి ఢీకొని 3 వాహనాలు ధ్వంసం – కృష్ణాపురం వద్ద హై లెవల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మంత్రులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న వారిలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనానికి వెనుకగా ఉన్న కార్లు దెబ్బతిన్నాయి.