వాహనదారులకు ఎంతో మేలు కలిగే విధంగా కేంద్రం మోటార్ వెహికిల్స్ రూల్స్‌లో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీంతో వాహనదారులకు చాలా ప్రయోజనం కలుగనుంది. కొత్త నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో నామినీ పేరును పేర్కొనాలి. వాహన యజమాని మరణిస్తే ఆ వాహనం ఓనర్ షిప్ నామినీకి సులభంగా బదిలీ అవుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే కాకుండా తర్వాత కూడ ఆన్ లైన్ ద్వారా నామినీ పేరును సర్టిఫికెట్‌లో చేర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వాహన యజమాని మరణిస్తే ఇతరుల పేరున మారటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొత్త నిబంధనతో నామినీ పేరున ఆ వాహనం సులువుగా మారి పోతుంది. అయితే వాహనం యజమాని మరణిస్తే ఆ విషయాన్ని 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలియచేయాలి. ఆ మేరకు సంబంధిత ఫారాన్ని 3 నెలల్లోపు వారికి అందజేయాలి.
డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...











