టీడీపీలో పనిచేయని నాయకులను ఉపేక్షించేది లేదు
వైసీపీ ఎమ్మెల్యే, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీలో సమర్థవంతగా పనిచేసే లీడర్లుకు సముచిత స్థానం కల్పిస్తామని, అలానే కోవర్టులను, పనిచేయని నాయకులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
స్థానిక పోరాటాలకు అందరూ సమాయక్త కావాలని, జగన్ పాలనలో ప్రజలు పేదలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉందన్నారు. దీనిని టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నెల నుంచి ధర పెంచి ఇస్తున్నారని ఆయన తెలిపారు. క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని, అదే స్పూర్తితో అందరూ పనిచేయాలని సూచించారు. మండల, నియోజకవర్గంలో పార్టీని శ్రేణులను సమాయక్తం చేసి వైసీపీ నేతల అవినీతిని ఎండ గట్టాలని పిలుపు నిచ్చారు. అలానే వైసీపీ నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుపిప్పి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా విభజన
రాష్ట్రంలో ప్రజాభిప్రాయాలు, మనోభావాలకు భిన్నంగా జిల్లా పునర్విభజన జరిగిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ అవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తి అవుతోందన్నారు. ఈ సందర్బంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ తీసుకువచ్చిన 14 పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం తొలగించి, పేర్లు తీసి వేసిందన్నారు. ఇప్పుడు జిల్లాకు పేరుపెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
Must Read:-వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు