త్రివిక్రమ్ చేయాల్సిన యన్టీఆర్ 30 సినిమా .. కొరటాల చేతుల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటి నుంచి అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు యన్టీఆర్ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యువ సుధా ఆర్ట్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెవ్లో బహుభాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. జూలై నెల్లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ సినిమాలో తారక్ సరపన ముంబై బ్యూటీ కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేసినట్టటు వార్తలొస్తున్నాయి.
ఆల్రెడీ కియారా అద్వానీ.. కొరటాల దర్శకత్వంలో వచ్చిన మహేశ్ బాబు మూవీ ‘భరత్ అనే నేను’లో వసుమతి గా చాలా క్యూట్ గా స్మార్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో కియారా గ్లామర్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అందుకే యన్.కే 2 లో కూడా కియారానే హీరోయిన్ గా ఎంపిక చేశారట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో.. యన్టీఆర్ సామాన్యుడి స్థాయి నుంచి రాజకీయాల్లో కి అడుగుపెట్లి మార్పులు తీసుకొచ్చే పాత్రను పోషిస్తున్నాడట. ఇక ఇందులో విలన్ గా తమిళ నటుడు అరవింద స్వామిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి ఈ సినిమాకి కియారా అద్వానీ ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.