గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండలో పురాతన శ్రీనీలకంఠేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ప్రహరీ గోడ, వేడుకలు నిర్వహించే మందిరాలను వైసీపీ నేతలు కూల్చివేయడంపై ధర్మకర్త ప్రభుకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలసి స్థానిక వైసీపీ నేతలు మందిరాలను కూల్చి వేశారని ధర్మకర్త ప్రభుకుమారి ఓ సెల్ఫీ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ రీత్యా ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. శ్రీనీలకంఠేశ్వరస్వామి దేవస్థానం మందిరాల కూల్చివేతలో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో పాత్ర కూడా ఉందని ప్రభుకుమారి ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని కూల్చివేతలు నిలిపివేయాలని ఆమె విజ్ఙప్తి చేశారు. దేవాలయం గోడను , వేడుకలు నిర్వహించే మందిరాలను కూల్చివేసి అక్కడ వైసీపీ నేతలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆమె వీడియోలో తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దేవాలయ స్థలాల్ని రక్షించాలని కోరారు.
Must Read ;- పుణ్యక్షేత్రం కోటప్పకొండను తవ్వేస్తున్న అక్రమార్కులు