మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో రవితేజ సరసన అందాల భామ శృతిహాసన్ నటించింది. ఈ మూవీ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. ఖచ్చితంగా ‘క్రాక్’ ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని ఏర్పరిచింది. ఇక ‘క్రాక్’ టీమ్ అయితే.. ఆల్రెడీ సక్సస్ సాధించేశాం అనే మూడ్ లో ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మాస్ మహారాజా రవితేజ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. అదేంటంటే.. ఓ ఇంటర్ వ్యూలో యాంకర్.. రవితేజ గార్ని దగ్గర నుంచి చూశారు కదా.. ఆయన డైరెక్సన్ చేసే ఛాన్స్ ఉందా.? అని డైరెక్టర్ మలినేని గోపీచంద్ ని అడిగితే.. రవితేజ గారు దర్శకుల హీరో. ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు కాబట్టి డైరెక్టర్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. భవిష్యత్ లో డైరెక్షన్ చేసినా చేయచ్చు అని చెప్పారు.
వెంటనే పక్కనే ఉన్న రవితేజ స్పందిస్తూ.. డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయ్.. చూద్దాం అని చెప్పారు. రవితేజ మాటలను బట్టి ఫ్యూచర్ లో ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తారనిపిస్తుంది. మరి.. రవితేజ దర్శకుడిగా ఎప్పుడు మారతారో..? ఎలాంటి సినిమా తీస్తారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- కోరమీసం పోలీసోడా..అంటూ శృతిహాసన్ ఏం చేసిందంటే!