జగన్ ప్రభుత్వంలో ఏం జరిగినా.. ఎలాంటవి జరిగినా అంతగా ఆశ్చర్యపోవడం శుద్ధ దండగ. ఇవి కామనే అనుకంటూ ఉండకపోతే రోజుకు ఒక పాతికసార్లైనా అయ్యో ఏంటిది అనుకుంటూ ఉండాల్సిందే మరి. తిరుమల విషయంలో జగన్ ప్రభుత్వం హయాంలో తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దేవుని ముందు అందరూ సమానమే.. కానీ అధికార పార్టీ వారు కాస్త ఎక్కవ సమానం అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికార గణం తమ ప్రవర్తనతో గుర్తుచేస్తూ ఉంటారు. ఇప్పుడెందుకిదంతా అనుకుంటున్నారా? తిరుమలలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ అవి సామాన్యులకు మాత్రమే అనే క్యాప్షన్‌ని దానికి జత చేస్తే బెటరేమో కదా. ఎందుకంటే సాక్షాత్తూ చీఫ్ విప్ చూస్తుండగానే అధికార నేత నిబంధనలకు నీళ్లొదిలేశారు.
తిరుమలలో డ్రోన్ కెమెరా నిషిద్ధమని తెలియదా..
అధికార పార్టీ నేత అమర్ నాథ్ రెడ్డి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. దాన్ని చిత్రీకరించడానికి మామూలుగా ఏ పత్రికకు సంబంధించిన వారినో అనుమతిస్తారు. కానీ, మన అధికార నేత ఏకంగా డ్రోన్స్‌తో తన తిరుమల యాత్రను చిత్రీకరించారు. అయితే అనకండి.. తిరుమలలో డ్రోన్స్ లాంటి వాటికి అనుమతి లేదు. బహుశా ఇదంతా తెలియక చేశారేమో అనుకునేరు. సాక్షాత్తూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఇక తిరుమల భద్రతా సిబ్బంది కూడా నోరు మెదపలేదు. అధికార గణం అలా చేస్తుంటే భద్రతా సిబ్బంది మాత్రం ఏం చేస్తారు పాపం!
Must Read ;- వైసీపీకి విరాళంతోనే శేఖర్‌రెడ్డికి ‘పరిశుద్ధతా’..?
అసలెందుకు అనుమతి లేదు..
సాధారణంగా తిరుమల కొండల మీద ఎటువంటి లోహ విహంగాలకు అనుమతి లేదు. విమానాలు, డ్రోన్స్ వంటి వాటికి తిరుమల కొండలపై తిరగకూడదనేది అనాదిగా వస్తున్న ఆచారం. దాన్ని పెద్ద అపచారంగా కూడా భావిస్తారు మన హిందూ సంప్రదాయంలో. ఇలాగే గతంలో కూడా విమానం తిరుమల కొండపై నుండి వెళ్లినందుకు అక్కడి పూజార్లు దీని గురించి వివరించి విమానాలను మళ్లించవలసిందిగా కోరారు.
దీనితోపాటు మరొక కారణం కూడా ఉంది. అదే భద్రతాపరమైన సమస్య. అందుకే పై నుండి తిరుమలలోని ఏ భాగాన్ని కూడా చిత్రీకరించడానికి అనుమతులు లేవు. అలా చిత్రీకరించి తిరుమలని పరిశీలించడానికి అవకాశం లభిస్తే వాటిని ఆసరాగా చేసుకుని ముష్కరులు ఎటువంటి దాడులకైనా పాల్పడే అవకాశాలు ఎక్కువ. ఇన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అనాదిగా ఇటువంటి నిబంధలను కొనసాగిస్తున్నారు .
ఇదేమన్నా కొత్తా ఏంటి?
తిరుమల బస్ టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం చేయడం, ఏకంగా కొందు అన్యమస్తులే టిటిడీ బోర్డు సభ్యులుగా ఉన్నారని కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసందే. అంతేనా, టిటిడీ సైట్‌లో హఠాత్తుగా పోర్న్ లింక్ ప్రత్యక్షమవడం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా టీటీడీ సభ్యులు కొలుసు పార్థసారధిని సెమి క్రిస్టమస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆహ్వన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. ఇకపై ఇలాంటి ఎన్నో.. ఇలాంటివి ‘ద్యావుడా’ అనుకుని కిమ్మనకుండా ఉండాల్సిందే తప్ప చేసేదేమీ లేదు. అవతల అసలే జగనన్న సైన్యం.. ఏం చేయగలం చెప్పండి.
Also Read ;- పుణ్యక్షేత్రం కోటప్పకొండను తవ్వేస్తున్న అక్రమార్కులు