ఒకప్పటి రౌడీలు నేటి రాజకీయ నేతలు అయ్యారు. వారే కాలం కలిసొచ్చి మంత్రులు కూడా అయ్యారు. కత్తులు పట్టుకున్నవారే.. వైట్ అండ్ వైట్ వేసేసుకోగానే గెటప్ మారిపోయింది. కేరెక్టర్ మాత్రం ఒరిజినల్‌గా అలాగే ఉంది. ఇప్పుడు ఏకంగా వారు చట్టాన్నే వారి చొక్కాగా వేసుకుని వచ్చేస్తున్నారు. ఇక వారికి అడ్డు అదుపు ఏం ఉంటుంది? ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక అది.. ఇది అని తేడా లేకుండా లాగేసుకుంటున్నారు. బిజినెస్‌లో చొరబడి.. వాటాలు లాగేసుకుంటున్నారు. గనుల్లో చొరబడి ఒప్పందాలు మార్చేస్తున్నారు. ఎక్కడా వేరేవారికి సందు లేకుండా.. దూరిపోతున్నారు. ఒకవైపు అధికారులు వీరి వైపే.. పోలీసులు వీరి వైపే.. కాబట్టి చట్టం పని చేయడం మానేసింది.. సారీ ఒకవైపే పని చేస్తోంది. అధికారం, అహంకారం చూపిస్తూ మరీ ఆక్రమించుకుంటోంది.
ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు
ఇలాంటి పరిస్ధితుల్లో జగనన్న ప్రభుత్వం భూసర్వే మొదలు పెడుతోంది. ఈ సర్వే మొదలు పెడతామని రెండు నెలల ముందే చెప్పింది. అంతకు ఆరు నెలల ముందే పార్టీ నేతలంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడక్కడ విలువైన భూములున్నాయో.. వాటిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ భూములను చక్కగా అధికారుల సహకారంతో ఐడెంటిఫై చేసి.. లైన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సర్వేలో ఆ భూములన్నీ ఈ నేతల పేరుతో పెట్టేస్తారు. అన్నీ అధికారికంగా వారి ఖాతాలోకి పడిపోతాయి. అప్పుడిక కబ్జా అయిందని.. అవలేదనే తంటాయే లేదు.
అలా భూములన్నీ ఎంచక్కా ఈ చట్టాన్నే చొక్కాలా వేసుకున్నాక జేబులో వేసేసుకోవచ్చు. అదే తంతు ఇప్పుడు జరగబోతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం భూదార్ పథకాన్ని ప్రారంభించింది. ఇలాగే భూరికార్డులన్నిటిని ప్రక్షాళన చేయటానికి ప్రయత్నించింది. పార్టీకి మద్దతిచ్చిన హీరో వంశీ సైతం తన పని కావటం లేదని విమర్శలు గుప్పించారంటే.. ఆ టైములో అధికారులు ఎంత కఠినంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పథకాన్ని మూలనబెట్టినట్టే పెట్టి.. అదే పథకాన్ని ఇప్పుడు వాడుకుంటూ.. తమ పని పూర్తి చేసుకోవడానికి వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు.
పూర్తయిన ప్రాజెక్టుకే హడావుడి..
ఎంత ఘోరం అంటే.. అప్పట్లో జగ్గయ్యపేటలోనే పైలెట్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. పూర్తయిన ప్రాజెక్టును మళ్లీ చేసినట్లు హడావుడి చేసి.. ఇప్పుడు రీసర్వే ప్రకటించారు. అదే పథకాన్ని వాడుకుంటూ ఇప్పుడు వైసీపీ నేతలు భూములు ఉచితంగా కొట్టేయడమే కాదు.. ఎవరికైనా డాక్యుమెంట్ కావాలంటే.. అందరి దగ్గరా డబ్బులు వసూలు చేస్తారు. జనం ఆ డబ్బులు కట్టలేక నానా పాట్లు పడాల్సిందే. ఏమైనా రాష్ట్రంలోని భూములను కొట్టేయడానికి అధికారికంగా వైసీపీ రెడీ అయిపోయింది. మరి ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకుంటాయో లేదో చూడాలి మరి.
Must Read ;- వైసీపీ నేత దౌర్జన్యం.. కౌలు రైతు సలీం ఆత్మహత్యాయత్నం