కరోనా సెకండ్ వేవ్ తెలంగాణను ఆగమాగం చేస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు మరణాల రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే సామాన్య ప్రజలకు ఏ రొగమొచ్చనా గాంధీని గుర్తుకువస్తోంది. రోగమొస్తే ఆసుపత్రిలో బెడ్ దొరకడం లేదు. ఒకవేళ కష్టపడి బెడ్ సంపాదించినా ఆక్సిజన్ దొరకదు. ప్రజల ఇబ్బందులు వర్ణానాతీతం. రాష్ట్రంలోనే అధిక కరోనా మరణాలు గాంధీనే జరుగుతున్నాయి. ఇతర ఆస్పత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులను ఇక్కడికి తరలిస్తుండటంతో వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
మార్చురీలో 300 మృతదేహాలు
కరోనాతో పాటు ఇతర రోగాల వల్ల గాంధీలో రోజూకు 40 మందికిపైగా చనిపోతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే అందులో సగం మృతదేహాలు మాత్రమే బంధువుల తీసుకెళ్తున్నారు. ఇక కరోనాతో చనిపోయినవాళ్ల బాడీలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణం అంత్యక్రియల నిర్వహణ ఖర్చుతో కూడుకోవడమే. కరోనా వేళ ఖరీదైన వైద్యం పొందలేని పేదలు, తమ బంధువులో, ఆప్తులో చనిపోతే అంత్యక్రియలు కూడా జరుపుకోలోని పరిస్థితి. సమారు రూ.30 వేల దాకా వసూలు చేస్తుండటంతో బడుగు జీవుల మృతదేహాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇప్పటిదాకా 300 వరకు శవాలు మార్చురీలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.
Must Read ;- ఆ ఘటన హృదయ విదారకరం.. హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఇండియా