దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పలుదేశాలు భారత్‌లో పరిస్థితిని గమనిస్తున్నాయి. తమ పౌరులు తక్షణం భారత దేశాన్ని వీడాల్సిందిగా అగ్ర రాజ్యం అమెరికా ఇప్పటికే సూచించింది. పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. సామూహిక అంత్యక్రియలు, ఆక్సిజన్ లేక చోటుచేసుకుంటున్న మరణాలు, బెడ్లు లేక కొవిడ్ బాధితుల అవస్థలు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ..ఇలా పలు కోణాల్లో భారత్‌లోని పరిస్థితిపై కథనాలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోదీ సర్కారు విఫలమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తున్న వేళ..తల్లి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన హృదయవిదారకర ఘటనపైనా అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు, జాతీయ మీడియా సంస్థలు స్పందించాయి. భారత్‌లోని దయనీయ పరిస్థితికి నిదర్శనంగా అభివర్ణించాయి. గతంలో బీహార్ , మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
20 కిలోమీటర్లు బైక్‌పై తల్లి మృతదేహం
శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ పరిధిలో కరోనాతో చనిపోయిన తల్లి మృతదేహాన్ని దాదాపు 20కిలోమీటర్లు బైక్ తీసుకెళ్లాల్సి వచ్చింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మందస మండలం కిల్లోయి పంచాయతీకి చెందిన చెంచుల (50) అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది. కొవిడ్ అనే అనమానాలూ ఉన్నాయి. కుమారుడు తన సమీప బంధువు సహాయంతో బైక్‌పై పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. వైద్యులు పరిశీలించి స్కానింగ్ చేయించాలని సూచించారు. అందుకోసం కాశిబుగ్గ గాంధీనగర్‌లో ఉన్న శ్రీకృష్ణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆతరువాత కాసేపటికే ఆమె చనిపోయింది. అదే సమయంలో పలాస, కాశీబుగ్గతో పాటు పలు ప్రాంతాల్లో కరొనా కట్టడికోసం రాకపోకల విషయంలో నియంత్రణలున్నాయి. ఇక చెంచుల కరోనాతో చనిపోయిందన్న కారణం చూపుతూ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ సిబ్బంది గానీ ముందుకు రాలేదు. ఆసుపత్రి వర్గాలు కూడా స్పందించలేదని బాధిత కుటుంబీకులు వ్యాఖ్యానించారు. దీంతో తల్లి డెడ్ బాడీని బైక్‌పై తరలిస్తున్నారు. మార్గ మధ్యంలో త్రిబుల్ రైడింగ్ చేస్తున్న కారణంతో పోలీసులు ఆపారు. వివరాలు అడిగేటప్పటికి అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు. అక్కడికక్కడ వాహన ఏర్పాటుకు ప్రయత్నించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ ఘటనపై జాతీయ మీడియాతో జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ 108 సర్వీసులు అందుబాటులోనే ఉన్నాయన్నారు. అయితే సదరు ఆసుపత్రి రవాణాకు నిరాకరించి ఉండవచ్చని, అందుకే ఈ ఘటన జరిగిందని, విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
Also Read ;- అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?
ట్విట్టర్‌లో ఈ వీడియో వైరల్..
ఈ ఘటనపై జాతీయ మీడియాతో పాటు యాహూ న్యూస్, లండన్ టైమ్స్ లాంటి పత్రికలూ వార్తలు ప్రచురించాయి. ట్విట్టర్‌లోనూ ఈ వీడియో వైరల్ అయింది. ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ సీనియర్ సభ్యుడు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు, ప్రజారోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగ్ల్-డెంగ్ ఈ వీడియోను రీట్వీట్, షేర్ చేశారు. భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ఘటన హృదయాన్ని కలిచివేసిందన్నారు. హార్ట్ బ్రేకింగ్ ఇండియా అని వ్యాఖ్యానించారు.
24 గంటల వ్యవధిలో 3.7లక్షల కేసులు
కాగా గత 24గంటల వ్యవధిలో భారత్‌లో 3.7లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 3645మంది చనిపోయారు. ఏపీలోగడిచిన 24 గంటల వ్యవధిలో 74,748 పరీక్షలు చేయగా 14,669 కేసులు పాజిటీవ్‌గా తేలాయి. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 58 మంది ప్రాణాలను కోల్పోయారు.
Must Read ;- ఆసుపత్రి నిర్వాకం.. రోడ్డుపైనే కరోనా రోగి మృతి
2) This is a true story.
“In a heart-wrenching development in Andhra Pradesh, due to the non-availability of ambulance, a woman's dead body had to be taken to her native village on a motorbike.
The shocking incident took place in Kasibugga town in Srikakulam district on Monday.— Eric Feigl-Ding (@DrEricDing) April 27, 2021
4) “According to local sources, following complaints of sickness, her family members on Monday took her to a private hospital in Kasibugga town near Palasa for treatment. https://t.co/QndXxCvTUi
— Eric Feigl-Ding (@DrEricDing) April 27, 2021
6) Following this, the autorickshaw driver immediately forced the family to alight from his vehicle and drove away.
Despite best efforts, the woman's family failed to secure the services of an ambulance to transport her body to their native village which is about 15 km away.
— Eric Feigl-Ding (@DrEricDing) April 27, 2021











