భారత్ కొవిడ్‌తో తల్లడిల్లుతున్న వేళ సచిన్ స్పందించారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు.కరోనా యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తోందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడిందని, అందుకే తనవంతుగా సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
ఆక్సిజన్ అత్యవసరం..
కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. మన ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. చాలా మంది కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందడం లేదని తెలిసింది. అది నన్నెంతగానో కుదిపేసింది.వారికి ఆక్సిజన్ అందించడం అత్యవసరం.. అంటూ ట్వీట్ చేశారు సచిన్.
Must Read ;- కరోనా బాధితులకు రాజస్థాన్ రాయల్స్ భారీ విరాళం
— Sachin Tendulkar (@sachin_rt) April 29, 2021