టాలీవుడ్ అజేయ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి రూపొందించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ అనిల్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. లాస్టియర్ , బిఫోర్ లాస్టియర్ అనిల్ రావిపూడి స్టార్ హీరోలతో సినిమాలు చేయగా.. అవి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ప్రస్తుతం ఈ దర్శకుడు వెంకీ తో ‘ఎఫ్ 3’ మూవీ రూపొందిస్తున్నాడు. బిఫోర్ లాస్టియర్ అనిల్ తీసిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’ మూవీకిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా .. కోవిడ్ కారణంగా.. వచ్చే సంక్రాంతికి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉండడంతోనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.
ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి మరో సీక్వెల్ పై కూడా కసరత్తులు చేస్తున్నాడని వినికిడి. లాస్టియర్ సంక్రాంతికి విడుదలైన .. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమా అనిల్ రావిపూడికి ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. కామెడీ, ఎమోషన్స్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ తీయాలనుకుంటున్నాడట అనిల్
మహేశ్ బాబుకి కెరీర్ లో ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందుకే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తో మరోసారి పనిచేయడం అతడికి కూడా ఆసక్తిని కలిగించేదే. ఎప్పటి నుంచో ఈ కాంబోలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబో లో రాబోయే సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సీక్వెలే అంటున్నారు. అయితే మహేశ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ‘ఎఫ్ 3’ మూవీ కంప్లీట్ అయ్యాకా.. అనిల్ రావిపూడి.. మహేశ్ బాబు తో చేయబోయే సినిమా ఇదేనని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఇది సరిలేరు నీకెవ్వరు సీక్వెల్లో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఈ దర్శకుడితో బాలయ్య సినిమా ఓకే అయిందట !