ఏమి హాయిలే ఇలా అంటున్నారు సూపర్ స్టార్ వారసులు. స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ గౌతమ్, సితార ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో యమ యాక్టివ్. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ విషయంలో గౌతమ్ కొద్దిగా వెనకబడి ఉంటాడనే చెప్పాలి. సితార బాలనటిగా సినిమాల్లో నటిస్తే చూడాలన్న కోరిక చాలామందికి ఉంది. నాన్న పాటలతో డ్యాన్సులు ఇరగదీస్తున్నా మహేష్ బాబు మాత్రం ఆమెకు సినిమాల్లో చోటివ్వడ లేదు.
కృష్ణ కుమార్తె మంజుల సినిమా నటి అనే సంగతి అందరికీ తెలుసు. అలాంటప్పుడు సితార సినిమాలు చేయడంలో ఇబ్బందేముంటుంది. భవిష్యత్తులో ఆమెను నటిగా చూడొచ్చన్న నమ్మకం చాలామందిలో ఉంది. తాజాగా ఆమె స్విమ్ సూటులో అన్నతో కలిసి ఈత కొడుతుంటూ జనం చక్కగా ఎంజాయ్ చేశారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది. ఎలాగూ మహేష్ వారసుడిగా గౌతమ్ ఎంట్రీ తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు సితార పాప ఎందుకు ఊరుకుంటుంది. కాబట్టి వీరి ఈత ఇంతటితో ఆగదు.. సినిమా ప్రపంచంలోనూ నటులుగా ఈత కొట్టాల్సిందేనేమో.
Must Read ;- అర్జున్ రెడ్డి దర్శకుడితో మహేష్ బాబు, తమన్నా











