సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యాడ్ ఫిల్మ్ కు కూడా మహేష్ పచ్చ జెండా ఊపేశాడు. దానికి దర్శకుడు మరెవరో కాదు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో పూర్తయింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ గ్యాప్ లో ఓ యాడ్ ఫిల్మ్ అవకాశాం సూపర్ స్టార్ దగ్గరకు వచ్చింది. ఓకే చెప్పేశారు.
ఇది విద్యుత్ ఉపకరణాల సంస్థ హావెల్స్ బ్రాండ్ యాడ్. ఇందులో మహేష్ బాబుతోపాటు మిల్కీ బ్యూట్ తమన్నా కూడా నటిస్తోందట. ఈరోజు ఈ యాడ్ ఫిలిం షూటింగులో మహేష్ పాల్గొన్నట్టు సమాచారం. సందీప్ రెడ్డి ప్రస్తుతం హిందీలో యానిమల్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటిస్తున్నారు. ఒకే ఒక్క రోజు షూటింగ్ తో ఈ యాడ్ ఫిలిం చిత్రీకరణ పూర్తవుతుందట.
Must Read ;- మహేశ్ బాబు సరసన జాన్వీకపూర్.. నిజమేనా?