సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ మూవీలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మహేశ్ తండ్రిగా ప్రముఖ మలయాళ నటుడ్ని దర్శకుడు ఎంపిక చేశాడనే వార్తలొస్తున్నాయి. ఆయన మరెవరోకాదు.. జయరామ్.
‘భాగమతి, అల వైకుంఠపురములో’ లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నారు జయరామ్. ఇప్పుడు మహేశ్ బాబు తండ్రిగా సర్కారు వారి పాటలో నటిస్తుండడం విశేషాన్ని సంతరించుకుంది. ఇందులో జయరామ్ బ్యాంక్ ఉన్నతాధికారిగా నటిస్తున్నారట. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్లు అప్పు చేసి దేశం విడిచిపెట్టి పోయిన ఓ బిజినెస్ మేన్ నుంచి ఆ డబ్బును తిరిగి తెచ్చి.. తన తండ్రి మీద పడ్డ మచ్చను చెరిపివేసే క్రమంలో మహేశ్ బాబు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. దుబాయ్ లో అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంటోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాతో జయరామ్ .. ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.
Must Read : మహేష్ బాబు తల్లి గా జ్యోతిక











