బర్త్ డే స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు మామూలుగా లేవు. ఒకరోజు ముందే ఈ వేడుకలకు నాంది పలికారు. హైద్రాబాద్ లోని శిల్ప కళా వేదికలో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాదు ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ లోనూ ఈ బర్త్ డే సందడి నెలకొంది. దర్శకుడు రాజమౌళి కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు తినిపించారు. ఆచార్య చిత్ర యూనిట్ లోనూ ఈ సందడి ఉంది. మెగాపవర్ స్టార్ ఇంటిముందు కూడా అభిమానుల హంగామా మామూలుగా లేదు. రామ్ చరణ్ కు ఇది 36వ పుట్టిన రోజు. 2007లో ‘చిరుత’తో హీరోగా రామ్ చరణ్ కెరీర్ ప్రారంభమైంది. సినిమా రంగంలో అడుగుపెట్టి 14 ఏళ్లు అయ్యింది.

ఈ 14 ఏళ్లలో 14 సినిమాల ప్రయాణం పూర్తయింది. ట్రిపుల్ ఆర్ ఆయనకు 15వ సినిమా అవుతుంది. వారసత్వంతో సినిమా రంగంలో అడుగుపెట్టినా తన స్టామినాతోనే తానేమిటో నిరూపించుకున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలు ఆచార్య, ట్రిపుల్ ఆర్ విడుదలవుతాయి. వచ్చే ఏడాది శంకర్ దర్శకత్వంలో సినిమా విడుదల ఉంటుంది. ఈ సినిమాని పాన్ ఇండియాగా సినిమాగా శంకర్ తీస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని ప్రముఖుల ట్వీట్లతో సోషల్ మీడియా హెరెత్తుతోంది.
Mega Power Star Ram Charan Birthday Celebrations :
శుక్రవారం జరిగిన వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జ తదితరులు పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందని సాయిధరమ్ తేజ్ అన్నారు. ఈ వేదిక మీద కరోనా సమయంలో సేవలు అందించిన అనేక మందిని సత్కరించారు. ఎన్టీఆర్, రాజమౌళి, మహేష్ బాబు, అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్.. ఇలా ఎందరో సినీ ప్రముఖులు రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
టైమ్ స్క్వేర్ వద్ద చరణ్ వీడియో
న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వద్ద ఉండే నాస్టాక్ భవనంలో ఉన్న బిల్ బోర్డుపై రామ్ చరణ్ వీడియో ప్రదర్శించడమంటే మాటలు కాదు. రామ్ చరణ్ ఐకానిక్ పోస్టర్లతో ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. దక్షిణాదిలో ఇలాంటి గౌరవం పొందిన మొట్టమొదటి హీరో రామ్ చరణ్ అనే చెప్పాలి. ఈ వీడియోని రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘వావ్.. ఇది ఎంత మధురానుభూతి..’అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వరుణ్ తేజ్, సమంత అక్కినేని, అనుష్కాశెట్టి లాంటి వారంతా ఈ పోస్ట్ ను లైక్ చేసి కామెంట్లు చేశారు.
View this post on Instagram
Must Read ;- మెగాపవర్ స్టార్ ఫైర్ కాస్ట్ పోస్టర్ తో రాజమౌళి











