ఏపీ సర్కారులో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. మంత్రి కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివ సాయి నందీ ష్ కు కూడా కరోనా సోకడంతో వీరంతా ఇంటివద్దనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు.
ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. నిత్యం సుడిగాలి పర్యటనలు చేసే మంత్రి మొత్తంశెట్టి కి కరోనా వైరస్ సోకడంతో సందర్శకులు ఎవరు కలవడానికి రావద్దని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే కార్యాలయ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ లో సంప్రదించ వచ్చునని వెల్లడించారు.
ఏపీలో ఇప్పటికే పలువురు మంత్రులు కరోనా బారిన పడడం గమనార్హం. చాలా మంది మంత్రులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే, వీలైనంత జాగ్రత్తగా ఉంటూనే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ వీరికి కరోనా సోకుంతోంది. పలువురు హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు.











